Home / Anjaneya Dandakam / PDF
Anjaneya Dandakam PDF
Download the Anjaneya Dandakam lyrics as a free printable PDF, checked against a printed edition. Every layout fits on as few pages as possible.
Free to print for personal and temple use. Choose a layout:
- Telugu, US LetterPDF 307 KB
- Telugu, A4PDF 307 KB
- English letters, US LetterPDF 123 KB
- Telugu and English lettersPDF 341 KB
- Large print (Telugu)PDF 308 KB
Or press Print on this page for the version below.
శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యయం ప్రకీర్తిప్రదాయం ప్రశస్తప్రకాయం భజేవాయుపుత్రం, భజేవాలగాత్రం భజేహంపవిత్రం, భజేసూర్యమిత్రం భజేరుద్రరూపం
భజేబ్రహ్మతేజం బటంచున్, ప్రభాతంబు సాయంత్రమీనామ సంకీర్తనల్ జేసినీరూపు వర్ణించి నీమీద నేదండకంబొక్కటింజేయ నూహించి
నీమూర్తిగావించి నీసుందరంబెంచి నీదాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొలిచెదన్ నిన్ను నేదలచెదన్ నీకటాక్షంబునన్ జూచితే
వేడుకల్ జేసితే, నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవిగర్భాన్వయా దేవా నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్నిలచితే తొల్లి సుగ్రీవుకున్మంత్రివై స్వామికార్యంబునందుండి శ్రీరామసౌమిత్రులంజూచి వారిన్విచారించి,
సర్వేశుపూజించి నబ్బానుజుంబంటుగావించి యవ్వాలినింజంపి కాకుత్స్థతిలకుం దయాదృష్టివీక్షించి కిష్కింధయేలించి శ్రీరాము కార్యార్థమై లంకకేతెంచియున్, లంకిణిన్జంపియున్
లంకయుంగాల్చియుం భూమిజంజూచి యానందముప్పొంగి, యావుంగరంబిచ్చి యారత్నముందెచ్చి శ్రీరాముకుంనిచ్చి సంతోషులంజేసి సుగ్రీవుడఅంగదా జాంబవంతాది నీలాదులంగూడి
యాసేతువుందాటి వానరామూక పెన్మూకలై దైత్యులంద్రుంచగా, రావణుండంత కాలాగ్నుడై యుగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి, యాశక్తియుంవేసి
యాలక్ష్మణుం మూర్ఛగావించగానప్పుడే వేగ సంజీవియుందెచ్చి సౌమిత్రికింనిచ్చి ప్రాణంబురక్షించగా యాకుంభకర్ణాదులం వీరాదివీరులం మరింబోరి శ్రీరాముబాణాగ్ని
వారందరుం యారావణుం జంపగా నంతలోకంబు లానందమైయుండి యవ్వేళల యవ్విభీషణుం వేడుకన్ దోడుకన్ వచ్చి
పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవియుందెచ్చి శ్రీరాముకున్నిచ్చి నంతనయోధ్యకుంవచ్చి పట్టాభిషేకంబు నేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరుంగూర్మిలేరంచు
మన్నించినన్ రామభక్తిప్రశస్తంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ జేసితే పాపముల్ బాయునే భయములుందీరునే భాగ్యముల్ గల్గునే
సకలసామ్రాజ్యముల్ సకలసంపత్కరముల్ గల్గునో వానరాకార యోభక్తమందార యోపుణ్యసంచార యోధీర యోధీర నీవేసమస్తంబు నీవేమహాజయం
నీవేమహాఫలముగా వెలసియా తారకబ్రహ్మమంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంచున్
మనఃపూతమైయెప్పుడున్ దప్పకందలచు నాజిహ్వయందున్ దీర్ఘదేహంబునన్ త్రైలోకసంచారివై రామనామాంకితధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్రనిజ్వాల కల్లోలహావీరహనుమంత
ఓంకార ఓంకార ఓంకారశబ్దంబులం పిశాచంబులం భూతప్రేతపిశాచశాకినిఢాకినీగాలిదయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్
రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మప్రభాభాసితంబైననీదివ్యతేజంబునన్ జూచిరారనాముద్దునరసింహా యంచున్ దయాదృష్టివీక్షించి నన్నేలునాస్వామి నమస్తే సదాబ్రహ్మచారి
నమస్తే వాయుపుత్రా నమస్తే […] పూర్ణహారి నమస్తే నమస్తే నమస్తే నమః.
Shri Anjaneyam prasannanjaneyam prabha divyayam prakirti pradayam prashasta prakayam bhaje vayuputram, bhaje vala gatram bhaje ham pavitram, bhaje surya mitram bhaje Rudra rupam
Bhaje brahma tejam batanchun, prabhatambu sayantrami nama sankirtanal jesi ni rupu varninchi nimida ne dandakamb okkatin jeya nuhinchi
Ni murti gavinchi ni sundarambenchi ni dasa dasundanai Rama bhaktundanai ninnu ne golichedan ninnu ne dalachedan ni katakshambunan juchite
Vedukal jesite, na moralinchite nannu rakshinchite Anjana devi garbhanvaya deva ninnencha nenentavadan
Daya shalivai juchite datavai brochite daggaran nilachite tolli Sugrivukun mantrivai svami karyambunandundi Shri Rama Saumitrulan juchi varin vicharinchi,
Sarveshu pujinchi nabbanujum bantu gavinchi yavvalinin jampi Kakutstha tilakum daya drishti vikshinchi Kishkindha yelinchi Shri Ramu karyarthamai Lankaketenchiyun, Lankinin jampiyun
Lankayun galchiyum Bhumijan juchi yanandamuppongi, yavungarambichchi ya ratnamundechchi Shri Ramukunnichchi santoshulan jesi Sugrivuda Angada Jambavantadi Niladulan gudi
Ya setuvun dati vanaramuka penmukalai daityulan drunchaga, Ravanundanta kalagnudai yugrudai kori brahmandamainatti, ya shaktiyun vesi
Ya Lakshmanum murchha gavinchaga nappude vega sanjiviyun dechchi Saumitrikin nichchi pranambu rakshinchaga ya Kumbhakarnadulam viradi virulam marimbori Shri Ramu banagni
Varandarum ya Ravanum jampaga nanta lokambu lanandamaiyundi yavvelala yav Vibhishanum vedukan dodukan vachchi
Pattabhishekambu cheyinchi Sita mahadeviyun dechchi Shri Ramukunnichchi nanta Nayodhyakun vachchi pattabhishekambu nekambu sanrambhamaiyunna ni kanna nakevvarun gurmileranchu
Manninchinan Rama bhakti prashastambuga ninnu ni nama sankirtanal jesite papamul bayune bhayamulun dirune bhagyamul galgune
Sakala samrajyamul sakala sampatkaramul galguno vanarakara yo bhakta mandara yo punya sanchara yo dhira yo dhira nive samastambu nive maha jayam
Nive maha phalamuga velasiya taraka brahma mantrambu pathiyinchuchun sthiramuga vajra dehambunun dalchi Shri Rama Shri Rama Shri Rama yanchun
Manah putamaiy eppudun dappakan dalachu na jihvayandun dirgha dehambunan trailoka sancharivai Rama namankita dhyanivai brahmavai brahma tejambunan raudra nijvala kallola havira Hanumanta
Onkara onkara onkara shabdambulam pishachambulam bhuta preta pishacha shakini dhakini galidayyambulan ni duvalambunan jutti nelambadan gotti ni mushti ghatambulan bahu dandambulan
Roma khandambulan drunchi kalagni Rudrundavai brahma prabha bhasitambaina ni divya tejambunan juchi rara namuddu Narasinha yanchun daya drishti vikshinchi nannelu na svami namaste sada brahmachari
Namaste vayuputra namaste purna Hari namaste namaste namaste namah